'2.O' నటి లెస్బియన్ రిలేషన్‌కు ఒత్తిడి చేసింది.. సినీ నటి ఆరోపణ
గురువారం, 1 నవంబరు 2018 (14:06 IST)
మీటూ ఉద్యమంలో సరికొత్త ట్విస్ట్. ఈ ఉద్యమం పుణ్యమాని ఇప్పటికే అనేక మంది హీరోయిన్లు, మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపులను వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "2.O"లో చిన్నపాత్రను పోషించిన నటి మాయా ఎస్. కృష్ణన్‌పై మరో సినీ నటి అనన్య రాంప్రసాద్ లైంగిక ఆరోపణలు చేసింది.
లెస్బియన్ రిలేషన్‌కు తనను బలవంతపెట్టిందని తీవ్ర ఆరోపణలు చేయడం కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది. మాయ... 'తొడరి', 'మగళిర్ మట్టుమ్', 'వేట్టైక్కారన్' తదితర చిత్రాల్లో ఈమె నటించగా, త్వరలో విడుదల కాబోతున్న రజనీకాంత్ '2.ఓ'లోను చిన్న పాత్ర పోషించింది.