తాను 14 ఏళ్ల వయస్సులో వుండగా ఓ ఫోటో సెషన్ కోసం వెళ్లానని.. అక్కడ ఫోటోగ్రాఫర్లు తన ఒంటిపై వున్న దుస్తులను తొలగించమన్నారని సారాజిఫ్ వెల్లడించింది. ఆ సమయంలో తాను కేవలం మిక్కీమౌస్ అండర్‌వేర్, స్పోర్టు బ్రా ధరించి ఉండగా, వాటిని కూడా తొలగించాలని ఫోటోగ్రాఫరు కోరాడని సారా తెలిపింది.
మోడల్స్ భద్రత, రక్షణ కోసం తాను 2012లో ''మోడల్ అలియన్స్'' పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని ఫ్యాషన్ పరిశ్రమలో లైంగికవేధింపుల నివారణకు ఈ సంస్థ పాటుపడుతుందని సారాజిఫ్ వివరించింది. ప్రస్తుతం సారాజిఫ్ న్యూయార్క్ నగరంలో మోడల్‌గా పలు షోలు నిర్వహిస్తోంది. ఇంకా వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తోంది.