Sohail, C. Kalyan, K. Achireddy, Koneru Kalpana
ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాశారు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఇదే వేదికపై నిర్మాత సి. కల్యాణ్ కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా కేట్ కట్ చేశారు.