చందనాన్ని వీరు అస్సలు తాకకూడదట..! (video)

మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (18:35 IST)
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న చందనాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. కానీ కొంతమంది దీనిని ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటారు. సుగంధ, ఔషధ గుణం కలిగిన గంధం, ఎర్ర చందనం, పసుపు చందనం, తెల్ల చందనం అనే మూడు రకాల్లో లభిస్తుంది. 
 
గంధపు పొడిని నిమ్మరసంలో కలిపి రాత్రి పడుకునే ముందు కళ్లకు రాసుకుంటే కంటి కణితులు పోతాయి. ఎర్రచందనం గ్రైండ్ చేసి నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గి శరీరం చల్లబడుతుంది.
 
గంధం వేసవిలో ఏర్పడే సమస్యలను దూరం చేస్తుంది. గంధం పొడిని పెరుగులో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
అయితే సుగంధంతో కూడిన గంధాన్ని గర్భిణీలు, బాలింతలు, ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉపయోగించకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు