సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు, మీ ఇష్టం అన్న కేసీఆర్: మెగా థ్యాంక్స్ అన్న చిరంజీవి
శనివారం, 25 డిశెంబరు 2021 (12:20 IST)
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
తెలుగు సినీ పరిశ్రమలో వేలాది కార్మికులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఈ నిర్ణయం సినీ పరిశ్రమకు ఊతమిచ్చేదిగా వుంటుందని పేర్కొన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారంపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పలువురు నటులు దీనిపై ట్విట్టర్ ద్వారా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు.