లబ్దిదారుల పేరిట ఖాతాల్లో నిధులు ఉన్నందున ఆ వడ్డీపై పూర్తి హక్కులు వారికే లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ పథకం అమలులో భాగంగా, మూడు నెలల క్రితమే ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది. తాజాగా నిర్ణయంతో ఒక్కో లబ్ధిదారుడుకి కనీసం 8 నుంచి 9 వేల వరకు వడ్డీ రూపంలో నగదు అందుతుందని సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు.
కాగా, పథకం అమలులో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు దాని పరిధిలోని దాదాపు 20వేల మంది లబ్దిదారులు ఉంటారని అంచనా వేసింది.
వీరిలో ఇప్పటికే 18 వేల మందికి రూ.10 లక్షలు చొప్పున రూ.1800 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. పాసాలమర్రిలో 76 మంది ఉంటారని అంచనా వేయగా, ఇప్పటికే 66 ఖాతాల్లో నగదు జమ చేసింది. బ్యాంకుల్లో లబ్దిదారుల పేరిట ప్రత్యేకంగా దళితబంధు ఖాతాలను ఓపెన్ చేసి ఈ నిధులను జమ చేసింది.