అలా... జ‌రుగుతుంది అనుకోలేదు - ముర‌ళీశ‌ర్మ‌

శనివారం, 31 ఆగస్టు 2019 (21:13 IST)
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం బిజీగా ఉన్నవారిలో మురళి శర్మ ఒకరు. తనదైన శైలిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్‌తో మెప్పించే ఈ యాక్టర్ అతిథి సినిమా నుంచి భాషా భేదం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన తెగ మెరుస్తున్నారు. అయితే తన కెరీర్ మొదట్లోనే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదని మురళి శర్మ వివరించారు.
 
అతిథి సినిమాలో నటిస్తున్నాను అని తెలియగానే మా అమ్మ, కృష్ణ గారి అబ్బాయి సినిమాలో మా అబ్బాయి నటిస్తున్నాడు అని అందరికి ఎంతో ఆనందంగా చెప్పుకున్నారని ఆ జ్ఞాపకాన్నీ తానెప్పటికీ మరచిపోలేనని తెలిపారు. ఇక ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నట్లు చెబుతూ.. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’, శర్వానంద్‌ కొత్త సినిమాతో అలాగే మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు మురళీశర్మ తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు