సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం సమకూర్చారు. తాజాగా ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సంగీతం సమకూర్చిన మణిశర్మను ప్రస్తుతం పట్టించుకునే వారు లేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న తెలుగు పాటలపై, ట్యూన్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
అప్పట్లో టాప్ హీరోలు సంగీత దర్శకుడు చెప్పే మాటకు గౌరవం ఇచ్చేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుత వాతావరణానికి ఇమడలేక తాను చాలా అవకాశాలు వదులుకున్నానని మణిశర్మ అన్నారు. తనకు కథే ముఖ్యమని.. హీరోలు చెప్పే విధంగా బాణీలు, వారి ఛాయిస్ వల్ల సంగీతానికి కథతో సందర్భాలతో పనిలేకుండా పోతోంది. దీని వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది.