మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతిబాబు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ ఈ చిత్రంలో రంగమ్మత్తగా నటిస్తోంది.
అయితే, ఈ చిత్రంలోని ఐదు పాటలను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ పాటలన్నీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి బిగ్ స్క్రీన్‌పై బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ప్రకటించారు. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ ఏంటో కూడా ఆయన బహిర్గతం చేశాడు.
ఈ చిత్రంలో పాటలు మొత్తం ఐదు కాదు ఆరు. ఉన్న పాటలకుతోడు చంద్రబోస్ మరో పాటను జత చేశారని.. దాన్ని రివీల్ చేయబోమని.. బిగ్ స్క్రీన్‌పై డైరెక్ట్‌గా చూపిస్తామని దేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఐదు పాటలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఇక ఆరో పాట ఏ రేంజ్‌లో ఉంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొనివుంది.