అనంతరం సాయికుమార్ లైన్‌లోకి వచ్చారు. ఆయన మాట్లాడుతూ, పాటలో పల్లవి, చరణాలు ఎంత ఇంపార్టెంటో చరణ్ అన్నా ఆయనకు అంత ఇది. బాలుకు చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా అంత ఎత్తుకు ఎదగాలని ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాను అటూ పేర్కొన్నారు. అనంతరం చరణ్ నుద్దేశించి నీకు నాన్నగారు నీకు నేర్పిన తొలి పాట అనుభవం గురించి మాట్లాడమన్నారు.
చరణ్ స్పందిస్తూ.. ఇలా పెద్దలను కలవడం ఆనందంగా వుంది. నాన్నగారు బతికివుంటే వేరే సందర్భంగా మీ అందరినీ కలిసేవారు. అది ఓ పండుగలా వుండేది. మీ అందరినీ జూమ్ మీటింగ్‌లో కలిసినందుకు, మీరు సమయాన్ని కేటాయించినందుకు ఆనందంగా వుంది. నాకు సినీమా వాళ్ళు పెద్దగా పరిచయంలేదు. చిరంజీవిగారు నాన్నగారికి ఆత్మీయులు.
ఈరోజు మధ్యాహ్నం తోట దగ్గరకు వెళ్ళి నాన్నగారితో కాసేపు గడుపుదాం అనుకుంటున్నాం. పైలోకంలో వున్న నాన్న ఆశీస్సులుంటాయి. అంటూ నాకు భగవంతుడు నాన్నగారే అని పేర్కొన్నారు. ఇక తొలి పాట గురించి చెబుతూ.. నాన్నగారు నాతో గడిపే సమయం వుండేదికాదు. ఆయన పాడగా విని నేను పాటను నేర్చుకున్నా అన్నారు. సముద్రంలోంచి ఓ బొట్టును ఎలా వేరు చేయలేమో నాన్నగారి పాటల్లో మంచివి ఏమిటంటే ఏమి చెప్పలేనని పేర్కొన్నారు.