గ్లామర్‌ డోస్‌ ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతున్నాయ్... "ఆ" ముద్ర ఎలా పడిందో?

ఆదివారం, 26 ఆగస్టు 2018 (12:58 IST)
గ్లామర్ డోస్ అధికంగా ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతున్నాయనీ, పైగా, సెక్సీ హీరోయిన్ అనే ముద్ర ఎలా పడిందో తనకు అర్థం కావడంలేదని హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా హాట్‌ స్టార్‌ ఇమేజ్‌ను సినిమా సినిమాకీ పెంచుకుంటూ పోతున్న రేష్మీ... ఇప్పుడు 'అంతకుమించి' హీట్‌పంచుతున్నారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'అంతకుమించి' ఫుల్‌ లెంగ్త్‌ కమర్షియల్‌ మూవీ. హారర్, గ్లామర్‌ రెండూ పుష్కలంగానే ఉంటాయి. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు థర్డ్‌ హారర్‌ మూవీ అని చెప్పారు. 
 
సెక్స్‌ సింబల్‌ సాధించడంపై స్పందిస్తూ, అవును.. ఆ ముద్ర పడిపోయింది. అయితే ఆ ముద్ర కావాలని నేను డెలిబరేట్‌గా చేయలేదు. కళాకారులుగా మేము ప్రయోగాలు చేయాలనుకుంటాం. మొదట్లో కరెంట్, ప్రస్థానం లాంటి సినిమాలు చేశాను. అప్పటి నుంచి అన్నీ అలాంటి సైడ్‌ రోల్స్, ఫ్రెండ్‌ క్యారెక్టర్స్‌ వచ్చాయి.
 
కానీ ఇండస్ట్రీలో ఎవరూ తెలిసిన వారు లేరు. దీంతో వచ్చిన ఆఫర్లు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్లాను. తొలి సినిమాల తర్వాత అలా కాదని, డిఫరెంట్‌గా ఉందని 'గుంటూర్‌ టాకీస్' ట్రై చేశాను. అది క్లిక్‌ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లామర్‌ అనేది త్వరగా ఎక్కుతుంది. ఆర్టిస్ట్‌గా నేను ప్రయత్నించాను. అవి క్లిక్‌ కాలేదు. ఇలా క్లిక్‌ అయిపోయింది. కరెంట్, ప్రస్థానం సినిమా టైమ్‌లో ఆస్టాంప్‌ పడిపోయింది. ఇప్పుడు ఈ స్టాంప్‌ పడిందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు