టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ఈగో ఎక్కువైందట. ఈ ఏడాదిలో 'ఛలో' చిత్రంతో సక్సెస్ అందుకున్న తరువాత అతడి ఆలోచనా విధానంలో మార్పులొచ్చాయి. ఈ సినిమా తన ఫ్యామిలీ నిర్మించడంతో తన తదుపరి సినిమాలు కూడా తన సొంత బ్యానర్‌లో నిర్మించాలనే ఆలోచనలో పడ్డాడు. ఇందులో భాగంగా 'నర్తనశాల' అనే సినిమాను సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఛలో సినిమాకు రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వచ్చాయని టాక్. ఈసారి నర్తనశాలకు ఏకంగా రూ.15కోట్లు పెట్టుబడి పెట్టినట్లు నాగశౌర్య చెప్పాడు. ఇప్పటివరకు ఈ కుర్రహీరో నటించిన ఏ సినిమాకు కూడా రూ.10కోట్లు దాటి కలెక్షన్లు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది పదిహేను కోట్లు నాగశౌర్య ఖర్చు పెట్టడం షాక్ ఇస్తోంది. అంతేకాకుండా.. సినిమాను నాగచైతన్య సినిమా 'శైలజారెడ్డి'కి పోటీగా విడుదల చేస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అతివిశ్వాసంతోనే శౌర్య ఇలా చేస్తున్నాడని, ఛలో సక్సెస్‌తో నాగశౌర్యకు ఈగో బాగా పెరిగిందని కామెంట్స్ వస్తున్నాయి. ఛలో తరువాత విడుదలైన కణం, అమ్మగారిల్లు సినిమా ఫ్లాప్ అయిన సంగతిని నాగశౌర్య గుర్తుంచుకోవాలని కూడా కామెంట్స్ వస్తున్నాయి.