అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రం ద్వారా అదరగొట్టిన కేథరిన్ థ్రెసా.. ప్రస్తుతం ఐటమ్ గర్ల్ గానూ, రెండో హీరోయిన్‌గానూ ఓ వెలుగు వెలుగుతోంది. చేతికందిన పాత్రలు చేసుకుంటూ పోతోంది. తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా 'గౌతమ్ నంద' సినిమా రూపొందింది. హన్సిక - కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో తన పాత్ర తనకి ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చింది. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన రెయిన్ సాంగ్ అంటే తనకు ఇష్టమని తెలిపింది. సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కాదు.. నటనకు ప్రాధాన్యత గల పాత్రలు చేసుకుంటూ పోతానని.. ఫస్టా? సెకండా? అనేది తరువాతేనని చెప్పుకొచ్చింది.