ఇదిలా వుండగా, ఈ ట్రైలర్ విడుదలకాగానే తమిళ దర్శకుడు శంకర్ తాను అనుకున్నఓ నవలలోని అంశాలను తీయాలని చేసుకున్న ప్రయత్నంలో ఓ సినిమాను కాపీ చేశారని కామెంట్ చేశారు. ఇది దేవర ట్రైలర్ విడుదలయ్యాక శంకర్ పోస్ట్ చేయడంపై మీ రేమంటారు? అని యువజర్నలిస్టు అడగడంతో ఆయన దానికీ దీనికి సంబంధంలేనది చెప్పే లోపల దేవర పబ్లిసిటీ వ్యవహారాలు చూసే వ్యక్తి కలగజేసుకుని ఫైర్ అయ్యాడు. ఓన్లీ సినిమా గురించే అడగండి, లేదంటే వెళ్ళిపోండి .. అని కటువుగా అనడంతో ఆ యువ జర్నలిస్టు అవాక్కయ్యాడు. ఆ వెంటనే దర్శకుడు ఇంటర్వూ ముగించాడు.
ప్రస్తుతం దేశమంతా ప్రచారంలో పాల్గొన్న దేవర టీమ్ రేపు అమెరికాలో ఫంక్షన్ చేయనుంది. ఇప్పటికే అక్కడ అభిమానులు, ఔత్సాహికులు అందుకు టిక్కెట్లను కొనుగోలు చేసేశారు. అక్కడ దేవరకు అనూహ్యమైన స్పందన వస్తోంది. మరి ఈనెల 27న విడుదలకాబోతున్న దేవర మొదటి పార్ట్ మాత్రమే విడుదలకాబోతుంది. రెండో పార్ట్ ఇంకా షూట్ చేయలేదని దర్శకుడు అంటున్నారు.