నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటు వేయని రజినీకాంత్

ఆదివారం, 23 జూన్ 2019 (18:02 IST)
నడిగర్ సంఘం ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. దీనికోసం రజినీకాంత్ ముంబైలో మకాం వేసివున్నారు. 
 
కాగా, చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ ఎన్నికల్లో సాయంత్రానికి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. అయితే, చాలా మంది నటీనటులు ఈ ఎన్నికల్లో నేరుగా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. 
 
పలువురు నటీనటులు బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రముఖ నటుడు రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా ఓటు వేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో హీరో విశాల్ సారథ్యంలోని పాండవుల జట్టు, సీనియర్ నటు కె. భాగ్యరాజ్ సారథ్యంలోని శంకర్ దాస్ జట్టు పోటీపడుతున్నాయి. విజయావకాశాలపై ఇరు జట్లూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు