జనసేనలో చిరంజీవి చేరుతారా? నాగబాబు ఏమన్నారు

శుక్రవారం, 3 జూన్ 2022 (16:19 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చిరంజీవి చేరుతారా అనే విషయంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చిరు జనసేన పార్టీలో చేరే అవకాశం లేదని, జనసేనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని నాగబాబు ప్రకటించారు. 
 
ఇతర రాజకీయ పార్టీలతో జనసేన పార్టీ పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, పార్టీ అధ్యక్షుడు, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంపిక చేస్తారని, సాధ్యమైనంత వరకు పార్టీని బలోపేతం చేస్తామని నాగబాబు చెప్పారు. 
 
గురువారం విజయనగరంలో పర్యటించి పార్టీ నేతలు, అనుచరులతో సమావేశమయ్యారు నాగబాబు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవికి సినిమాలంటే మక్కువ. చిరు తన సినిమాలు, సినీ సమాజానికి చేస్తున్న సేవతో చాలా హ్యపీగా ఉన్నాడు. అసలు ఆయన రాజకీయాల్లోకి రావడానికి అంతగా ఇష్టపడటం లేదని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు