నాగ చైతన్య, కృతి శెట్టి జంట‌గా ద్విభాషా చిత్రం NC 22 ప్రారంభం

మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (14:38 IST)
NC22 poster
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి NC22 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 నాగచైతన్య తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభుకి కూడా ఇది తొలి తెలుగు సినిమా.
 
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమంతో ప్రారంభమైయింది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి.  
 
నాగ చైతన్య అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో NC22 చిత్రీకరణ ప్రారంభం కానుంది.
 
"అక్కినేని నాగేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో.. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అద్భుతమైన అప్‌డేట్‌ను ప్రకటిస్తున్నాం. రేపటి నుండి #NC22 యాక్షన్ బిగిన్స్" అని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా నాగ చైతన్య సంబధించిన ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇది అందరినీ సర్ ప్రైజ్ చేయడంతో పాటు ఆసక్తిని పెంచింది.
 
నాగ చైతన్య అప్పిరియన్స్, లుక్ రివీల్ చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్‌లో నాగ చైతన్యపై కొన్ని టార్గెట్‌ లు వుండటం గమనించవచ్చు. పోస్టర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో పవర్ ఫుల్ వైబ్స్ ని కలిగివుంది.  
 
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు.  ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించనుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు చిత్రానికి పని చేస్తున్నారు.
 
స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. రేపటి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.  
 
తారాగణం: నాగ చైతన్య, కృతి శెట్టి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
డైలాగ్స్: అబ్బూరి రవి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు