డైవోర్స్ తర్వాత చైతూ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఏం చెప్పాడో అని ఆత్రుతగా చూస్తే...

సోమవారం, 4 అక్టోబరు 2021 (18:34 IST)
గాంధీ జయంతి నాడు టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత డైవోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇండస్ట్రీలో సంచనలమైంది. లవ్లీ కపుల్ అనే పేరు సాధించిన ఈ జంట విడిపోవడంపై చాలామంది ఆవేదన వ్యక్తం చేసారు. ఐతే వారివారి వ్యక్తిగత కారణాలు తెలియదు కనుక మీడియా కూడా కామ్ అయిపోయింది.
 
ఇకపోతే.. విడాకుల తర్వాత నాగచైతన్య తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. లవ్ స్టోరీ ప్రమోషన్లో భాగంగా చైతు ఓ ప్రైవేట్ ఛానల్ ముందుకు వచ్చారు. దర్సకుడితో కలిసి పిచ్చాపాటీ మాట్లాడారు. పర్సనల్ విషయాలు తెప్పించి అంతా మాట్లాడాడు చైతు. ఈ ఇంటర్వ్యూలో ఏదయినా చెప్తాడేమోనని అనుకున్నారు కానీ సినిమా విషయాలు చెప్పేసి బైబై చెప్పేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు