నాగ శౌర్య రంగబలి తో రాబోతున్నాడు

గురువారం, 25 మే 2023 (12:14 IST)
Naga Shaurya, Rangbali
హీరో నాగ శౌర్య ప్రస్తుతం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రంగబలి'లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో యూనిక్ చిత్రాలను రూపొందించడంలో మంచి అభిరుచి ఉన్న ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్యకి జోడిగా యుక్తి తరేజ నటిస్తోంది.
 
పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్న ఈ  సినిమా ఫస్ట్  సింగిల్ మన ఊరిలో ఎవడ్రా అపేది పాట విడుదలైయింది. నాగ శౌర్య అత్యంత ఎనర్జిటిక్  బీట్‌లతో ఈ పెప్పీ నంబర్‌తో మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ పాట లోకల్ లో ఉండడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. అనురాగ్ కులకర్ణి  ఈ పాటని  డైనమిక్‌గా పాడాడు. నాగశౌర్య తన మాస్ డ్యాన్స్‌లతో పాటలో గ్రేస్ చూపించాడు. జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. పవన్ బాసంశెట్టి, శ్రీ హర్ష ఈమని కలిసి సాహిత్యం అందించారు.
 
ఈ సినిమాలో నాగ శౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తున్నారు.
 
దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,  పవన్ సిహెచ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటర్, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌.
 
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు