జబర్దస్త్‌ చమ్మక్ చంద్ర స్కిట్‌లోనే అలా..? హైపర్ ఆదిని ఆయన పిలవలేదట..

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (16:52 IST)
జబర్దస్త్‌లో అభ్యంతరకరమైన స్కిట్‌లు వుంటాయని.. ఆ షోలో అడల్ట్ జోకులు పేలుతాయని వస్తున్న విమర్శలపై ఆ షో జడ్జి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర వేసే కొన్ని స్కిట్స్ లోనే కొంచెం అడల్ట్ కామెడీ వుంటుంది. ఆ  తరహాలో నవ్వించడం చమ్మక్ చంద్ర స్టైల్ అని.. మిగిలిన వారి స్కిట్లలో అలాంటి అడల్ట్ సామాగ్రి వుండదని నాగబాబు అన్నారు. 
 
కానీ కొంతమంది విమర్శిస్తున్నట్టుగా జబర్దస్త్ చూడలేనంత భయంకరమైన షో ఏమీ కాదని నాగబాబు వ్యాఖ్యానించారు. అసభ్యతగా అనిపించే కార్యక్రమాలు, థియేటర్లకు వచ్చే బూతు సినిమాలు చాలానే ఉంటున్నాయని.. వాటితో పోల్చితే జబర్దస్త్‌లో చూపించేది ఏమీ లేదని తేల్చి చెప్పారు.
 
మరోవైపు జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన హైపర్ ఆది.. షోలతో పాటు సినిమాలతో బిజీ బిజీ అవుతున్నాడు. తన సినిమాకు మాటలు రాయడానికి త్రివిక్రమ్ నుంచి హైపర్ ఆదికి పిలుపు వచ్చిందని జోరుగా ప్రచారం సాగుతోంది. త్రివిక్రమ్ బిజీగా ఉండటం వల్లనే ఆదికి ఛాన్స్ ఇస్తూ ఉండొచ్చనే టాక్ వినిపించింది. దీనిపై హైపర్ ఆది స్పందిస్తూ.. తానేసే పంచ్‌ల వల్ల త్రివిక్రమ్‌తో తనను పోల్చారు. 
 
కానీ ఆయన నుంచి తనకు పిలుపు రాలేదని.. త్రివిక్రమ్‌ను రెండు మూడు సార్లు కలిశాను. అదీ ఆయన మీద అభిమానంతోనే.. తన సినిమాకు మాటలు రాయమని తనను ఆయన అడగలేదని.. అయినా తన సినిమాకు తానే మాటలు రాసే మాటల మాంత్రికుడికి తనతో పనేం వుంటుందని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు