దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలి : నాగబాబు

సోమవారం, 9 ఆగస్టు 2021 (16:45 IST)
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలని ఆయన ఆకాంక్షించారు. 
 
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలని ఓ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఎత్తుకు పైఎత్తు వేసేవారు కాకుండా దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. 
 
ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా రాష్ట్రపతి పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను శరద్ పవార్ స్వయంగా కొట్టిపారేశారు. ఇప్పుడు రతన్ టాటా పేరు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా వచ్చే ఏడాది జూలై 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు