ఈ సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 'నేను బాధలో, విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. చరిత్రలో ఎప్పుడు ప్రేమ, నిజాయితీనే శాశ్వతంగా ఉంటాయి. కొందరు హంతకులు, నియంతలు ఉంటారు.. వెన్నుపోటు పొడుస్తారు. వారి గెలుపు ఎప్పుడు తాత్కాలికమే. వారు ఎప్పటికయినా నేలకొరగక తప్పదు. ఇదే జరిగి తీరుతుంది. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం` అంటూ సమంత సోషల్ మీడియాలో పేర్కొంది.
సమంత-చైతన్య విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించారు. వారిద్దరూ విడిపోవడం బాధాకరమని ట్వీటర్ పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య జరిగినవి వ్యక్తిగత, అంతర్గత వ్యవహారమని తెలిపారు. సమంత-చైతన్య ఇద్దరూ నాకిష్టమేనన్నారు. సమంత తమ కుటుంబంతో ఉన్న రోజులన్నీ అద్భుత తీపి గుర్తులన్నారు. వారిద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
నాగచైతన్య-సమంత విడాకులపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. వివాహం మరణం అయితే.. విడాకులు పునర్జన్మ అని వ్యాఖ్యానించాడు. పెళ్లిళ్లు వద్దు.. విడాకులు సెలబ్రేట్ చేసుకోండి అని ఆర్జీవీ కామెంట్ చేశాడు. ఎక్కువ పెళ్లిళ్లు కొన్ని రోజులు కూడా ఉండటం లేదు. సంగీత్ సెలబ్రెట్ చేసుకోవాల్సింది పెళ్లి టైమ్‌లో కాదు.. విడాకులు తీసుకున్నప్పుడు నిజమైన సంగీత్ జరుపుకోవాలి అని ఆర్జీవీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.