'బిగ్ బాస్ 3' హోస్ట్‌గా టాలీవుడ్ 'మన్మథుడు'

మంగళవారం, 19 మార్చి 2019 (14:07 IST)
వరుసగా రెండు సీజన్‌లతో అదరగొట్టేసిన బిగ్ బాస్‌కి సీక్వెల్‌గా 'బిగ్ బాస్ 3'కి సంబంధించిన సన్నాహాలను 'స్టార్ మా'వారు మొదలుపెట్టేసింది. 'బిగ్ బాస్ 1'ను హోస్ట్‌గా ఎన్టీఆర్ రక్తి కట్టించినప్పటికీ... బిగ్ బాస్-2లో నాని కాస్త తడబడినట్లుగానే అనిపించింది. దాంతో పెద్ద మొత్తంలో పారితోషికం ఆఫర్ చేసి, 'బిగ్ బాస్ 3'కి కూడా ఆయననే తీసుకోవడానికి నిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ... రాజమౌళి సినిమా కోసం వరుసగా డేట్స్ ఇచ్చేసిన కారణంగా ఎన్టీఆర్ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు సమాచారం.
 
ఆ తర్వాత ఈ రియాలిటీ షో నిర్వాహకులు టాలీవుడ్ మన్మథుడు నాగార్జునను సంప్రదించినట్లుగా వినికిడి. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని తనదైన స్టైల్‌లో సమర్ధవంతంగా నడిపించిన కింగ్ నాగార్జున... ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. దీంతో 'బిగ్ బాస్ 3' హోస్ట్‌గా నాగ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ... అవి ఆయన సొంత బ్యానర్‌లలోనివే కావడంతో డేట్స్ సమస్య ఉండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు