నాగార్జున కొత్త సినిమాలో క్యారెక్టర్ ఇదే...

శనివారం, 23 నవంబరు 2019 (21:48 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవ‌ల బిగ్ బాస్ సీజ‌న్ 3 కంప్లీట్ చేయ‌డంతో ఇక నుంచి సినిమాలపై దృష్టి పెట్ట‌నున్నారు. బంగార్రాజు సినిమా చేస్తాడ‌ని అనుకున్నారు కానీ... ఆ ప్రాజెక్ట్ విష‌యంలో ఇంకా ఫైన‌ల్ డెషిస‌న్ తీసుకోలేద‌ట‌. ఈ సినిమా కంటే ముందుగా కొత్త ద‌ర్శ‌కుడు సొల్మాన్‌తో ఓ సినిమా చేయ‌నున్నారు.
 
డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌గ్గ‌ర ఊపిరి, మ‌హ‌ర్షి సినిమాల‌కు రైట‌ర్‌గా వ‌ర్క్ చేసారు సోల్మాన్. అత‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా సోల్మాన్‌కే ఇచ్చార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అస‌లు విష‌యానికి వ‌స్తే... ఇందులో నాగార్జున ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడ‌ని తెలిసింది.
 
మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పైన నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమాని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రి.. ఈ సినిమాతో అయినా నాగ్ విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు