వెండితెర అతిలోక సుందరి శ్రీదేవికి అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు వరించింది. 2018 సంవత్సరానికిగాను ఈ దివంగత నటికి ఏయన్నార్ అవార్డును ప్రదానం చేయనున్నారు. అలాగే, 2019 సంవత్సరానికి కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఈ సంవత్సరానికి బాలీవుడ్ అగ్రనటి రేఖకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
నిజానికి ప్రతి యేటా అక్కినేని ఫ్యామిలీ ఏయన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఒక్కో సెలబ్రిటీని ఈ అవార్డుకు ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా, గత 2017లో రాజమౌళికి ఏఎన్ఆర్ అవార్డు దక్కింది. తాజాగా శ్రీదేవి, రేఖలను ఎంపిక చేశారు.