Bheemaneni Srinivasa Rao, Viswanth Duddampudi, Anuroop Katari
పూర్తి వినోదాత్మక చిత్రంగా నమోను తెరకెక్కిస్తున్నారు. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. శనివారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.