పోస్టర్‌ను గమనిస్తే.. కొబ్బరికాయ, పువ్వులు అన్నింటినీ తీసుకుని గుడిలో పూజకు వెళుతున్న అమ్మాయిగా ప్లెజంట్ లుక్‌లో సంయుక్త ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డెవిల్ సినిమాను నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. డెవిల్ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఆయన ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన బింబిసారతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డెవిల్తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.
దేవాన్ష్ నామా సమర్పకుడిగా.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహిస్తుండగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.