నటుడు కోట శ్రీనివాసరావ్ గురించి తెలియందికాదు. ఆయన మాడ్యులేషన్, హావభావాలు, టైమింగ్ వెండితెరపై కనువిందు చేస్తాయి. ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించిన ఆయన గత కొంతకాలంగా వయస్సురీత్యా వచ్చిన అనారోగ్యకారణంగా నటనకు దూరంగా వున్నారు. ఈ విషయాన్ని ఆయన్ను ఆమధ్య అడిగితే ఊపిరి వున్నంతవరకు నటిస్తూనే వుంటాను. కానీ ఎవరూ నన్ను పిలవడంలేదు. అంతా కొత్త పిల్లకాయలు దర్శకులుగా వచ్చారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.