దీపికా పదుకొణెతో కలిసి నటించాలనుంది.. దసరా ప్రమోషన్‌లో నాని (video)

బుధవారం, 29 మార్చి 2023 (10:00 IST)
దసరా సినిమా ప్రమోషన్‌లో నాని బిజీ బిజీగా వున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి దీపికా పదుకొణెతో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అమీర్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని కూడా అన్వేషిస్తానని ఢిల్లీలో జరిగిన దసరా మూవీ ప్రమోషన్‌లో తెలిపాడు.
 
ఇంకా నాని మాట్లాడుతూ.. "దీపికా పదుకొణె ఒక అద్భుతమైన నటి కాబట్టి ఆమెతో కలిసి పనిచేయడానికి నేను ఇష్టపడతాను. నాకు అవకాశం, సరైన కథ లభిస్తే, నేను ఆమె సరసన నటించడానికి ఇష్టపడతాను." అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. 
 
ఇకపోతే, తెలుగులో 'అష్టా చమ్మా', 'రైడ్', 'భీమిలి కబడ్డీ జట్టు', 'అలా మొదలైంది', 'పిల్ల జమిందార్', 'ఈగ', 'ఏటో వెళ్లిపోయింది మనసు', 'ఎవడే సుబ్రమణ్యం' వంటి చిత్రాలతో నాని తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే  ‘బిగ్ బాస్ తెలుగు’ రెండవ సీజన్‌కి కూడా హోస్ట్‌గా వ్యవహరించాడు. ‘జెర్సీ’ చిత్రంలో చాలా ప్రశంసలు పొందాడు.
 
తాజాగా నాని బాలీవుడ్‌పై తనకున్న ప్రత్యేక ప్రేమ గురించి మాట్లాడుతూ, రాజ్‌కుమార్ హిరానీ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆయన సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టమని తెలిపింది. అలాగే అజయ్ దేవగన్ అంటే నచ్చుతాడని వెల్లడించాడు. 
 
తన భార్య గురించి నాని మాట్లాడుతూ.. తన భార్య అంజనకు తన సినిమాలంటే ఇష్టమని చెప్పాడు. ఆమె నా సినిమాలు చూడటాన్ని ఇష్టపడుతుంది. విడుదలయ్యే సినిమా మార్నింగ్ షోకు వెళ్లిపోతుందని తెలిపాడు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు