జెర్సీ తరువాత నాని నటిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్సకత్వంతో మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా నాని ప్రమాదానికి గురయ్యాడు. కాలికి.. చేతికి దెబ్బలు తగిలాయి. దెబ్బ పెద్దది కాకపోయినా వారంరోజుల పాటు మాత్రం రెస్ట్ ఉండాలని వైద్యులు సూచించారు.
హీరోలు గాయాలబాట పట్టడం రాంచరణ్‌తో మొదలైంది. వర్కవుట్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్‌కు గాయమైంది. ఇది జరిగి మూడు నెలలవుతున్నా చెర్రీ ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. నెలాఖరులో ఆర్.ఆర్.ఆర్. సినిమాలో జాయిన్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. రాంచరణ్ తరువాత ఎన్టీఆర్, ఇప్పటికి ఎన్టీఆర్‌కు గాయమై సెట్స్ మీదకు వచ్చాడు. కానీ వెంటనే నానికి దెబ్బతగలడంతో తెలుగు సినీ పరిశ్రమలో యువ హీరోలకు వరుసగా దెబ్బలు తగులుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది.