సక్సెస్‌కు వరుస చిరునామా నాని.. నినుకోరి చిత్రం కలెక్షన్లు 3 రోజుల్లో 25 కోట్లు

మంగళవారం, 11 జులై 2017 (06:47 IST)
ఇప్పుడు తెలుగు చిత్రసీమలో చిన్నిచిత్రాల విషయంలో ఎవరూ దరిచేరడానికి కూడా సాహసించని రారాజు నాని. తాను నటించిన తాజా చిత్రం నిన్ను కోరి.. సెన్షేషనల్ హిట్‌గా నిలిస్తూ బాక్సాఫీస్ వద్ద నానీ చిత్రాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం విడుదలైన రోజునుండి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు దర్శనమిస్తున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నాని నటనా ప్రతిభ అద్వితీయంగా ఉంది. నాని పెరఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చిత్రంలో నాని సరసన నివేదాథామస్ ఎంతో గ్లామర్ గా కనిపించింది. సినిమా చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తుండటంతో కొత్తవారికి టికెట్ దొరికే పరిస్థితి లేదు.
 
ఇక ఈ సినిమా కలెక్షన్స్ మెరుపువేగంతో దూసుకుపోతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే 25 కోట్ల కలెక్షన్స్ రాబట్టి పెద్ద సినిమాల జాబితాలో చేరిపోయిందీ చిత్రం. దీంతో సినిమా వర్గాలు,డిస్ట్రిబ్యూటర్లు,నాని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాని, నివేదా థామస్ జంటగా.. ఆది పినిశెట్టి కీ రోల్‌లో శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘నిన్నుకోరి’ ప్రపంచ వ్యాప్తంగా జూలై 7న రిలీజ్ అయ్యి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
డబుల్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపుమీద ఉన్న నాని మరో లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో ప్రేక్షకులముందుకు రానుండటంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పాడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్స్‌కు అద్భతమైన రెస్పాన్స్ నాని ఖాతాలో మరో హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యింది చిత్రయూనిట్. వారి అంచనాలకు తగ్గట్లుగానే.. ప్రివ్యూ షోల స్టార్టింగ్స్ నుండి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను సాధిస్తోంది.
 
‘నిన్నుకోరి’ మూవీ విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ సాధించడంతో నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వచ్చేశారు. తాజాగా నిన్నుకోరి మూవీ తొలిరోజు పది కోట్ల(గ్రాస్) కలెక్షన్స్‌ను సాధించి నాని కెరియర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే నాని ‘నేను లోకల్ మూవీ కూడా 10 కోట్ల గ్రాస్‌ను సాధించగా .. నిన్నుకోరి తొలిరోజే 10 కోట్లను క్రాస్ చేయడం విశేషం. 
 
నాని ‘నిన్నుకోరి’ తెలుగు రాష్టాల్లోనే కాకుండా అమెరికాలో ‘నిన్నుకోరి’ మూవీ 500 పైగా ప్రీమియర్ షోలను ప్రదర్శించడంతో నానికి యూఎస్‌లో ఉన్నా ఫాలోయింగ్ ఏంటో అర్థమైపోతుంది. అత్యధిక థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ ప్రీమియర్ షోలతో మంచి వసూళ్లను రాబట్టింది. నాని కెరియర్‌లోనే అత్యధికంగా 1.7 లక్షల డాలర్లను కొల్లగొట్టడంతో వీకెండ్ అదిరిపోయే వసూళ్లు రాబట్టి మిలియన్ మార్క్‌కి చేరువ కావడం పక్కా అని తేల్చేసింది నిన్నుకోరి మూవీ. 
 

వెబ్దునియా పై చదవండి