జెంటిల్‌మెన్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నాని.. జూన్ 17న రిలీజ్!

శనివారం, 11 జూన్ 2016 (18:55 IST)
భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ వంటి అందించిన విజయంతో ''ఈగ'' హీరో నాని భలే భలే హ్యాపీగా ఉన్నాడు. తాజాగా నాని జెంటిల్‌మెన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది. తన తాజా చిత్రం ఇంక థియేటర్లోకి రాక ముందే మరో సినిమాను పట్టాలెక్కించాడు నాని. 
 
విరించి వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ప్రస్తుతం చిత్రం షూటింగ్ మెదక్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాని, పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపించనున్నాడు. గతంలో నాని కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంలో బాలకృష్ణ అభిమానిగా నటించిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి