నాన్న త్యాగాన్ని తెలియ‌జెప్పే నాన్నంటే చిత్రం

బుధవారం, 28 సెప్టెంబరు 2022 (15:57 IST)
Nannante poster release
నాన్న వివుల‌ను, త్యాగాన్ని తెలియ‌జెప్పే పాయింట్‌తో నాన్నంటే చిత్రం రూపొందుతోంది.  ఏఆర్ ఫిల్మ్ బ్యానర్ పై, నాగేశ్వర్ సమర్పణలో  నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో అశోక్ రెడ్డి లెంకల నిర్మించిన చిత్రం 'నాన్నంటే'. YSK ,(వై ఎస్ కె ) ,నిహరిక చౌదరి , వరేణ్య ఆగ్రా , అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు ,వి.కరుణాకర్ ప్ర‌ధాన‌ పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 14న థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లంచ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగింది.
 
చింతలూరు నాగరాజ్ 'నాన్నంటే' చిత్రం పోస్టర్ లాంచ్ చేశారు. నటుడు, నిర్మాత కుప్పిలి శ్రీనివాస్ ట్రైలర్ లాంచ్ చేశారు. నటుడు గబ్బర్ సింగ్ సాయి రెండో ట్రైలర్ లాంచ్ చేశారు. నటుడు భాషా చిత్ర ఫ్లెక్సీ ఆవిష్కరించారు.
 
గబ్బర్ సింగ్ సాయి, నాగరాజ్, భాషా, నటుడు ఆర్పీ మాట్లాడుతూ.. బంధాలు, అనుబంధాలు ఆవిష్కరించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని అన్నారు. ఇలాంటి సినిమాలకు అందరు సపోర్ట్ చేయాలని కోరారు.
కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ... నాన్న గొప్పదనాన్ని ఈ చిత్రం గొప్పగా చెప్పిందని, పిల్లలకు మంచి మెసేజ్ ఇస్తుందని అన్నారు. శివ సాంగ్ చాలా బాగుందన్నారు.
 
నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ... నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలని కోరారు. కోట శంకర్ రావు మాట్లాడుతూ... ప్రొడ్యూసర్ తనకు మంచి పాత్ర ఇచ్చారని, మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు. 
 
న‌టీన‌టులు : YSK ,(వై ఎస్ కె ) , నిహరిక చౌదరి , వరేణ్య ఆగ్రా లంకెల అశోక్ రెడ్డి ,కోట శంకర్ రావు,తోట సుబ్బారావు ,వి.కరుణాకర్ ,మంచికంటి వేంకటేశ్వర్లు (M. V. P) ,దుర్గా ప్రసాద్ ,తన్నీరు నాగేశ్వర్ ,ఎన్. విజయలక్ష్మి, ఎ. విజయ ,అంబికా, ఏ.పూజిత రెడ్డి ,మాస్టర్ ఆషు , లక్ష్మీ రామ్ ,

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు