ముందుగా తమన్నా, కాజల్, దీపికా పడుకునేల పేర్లు వినిపించినా.. చివరికి అనుష్కనే సుందర్ సి ఖాయం చేసినట్లు తెలుస్తోంది. సినీ నటి ఖుష్బూ భర్త, సినీ నటుడు సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
జయం రవి, ఆర్యలు హీరోలుగా, శ్రుతిహాసన్ టైటిల్ రోల్ అనుకున్నా.. తనకు డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదన్న కారణంతో సంఘమిత్ర నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది శృతిహాసన్. దీంతో టైటిల్ రోల్ కోసం మరో స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన చిత్రయూనిట్ అనుష్కనే సంప్రదించిందట. అయితే అనుష్క ఈ ఛాన్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా లేదా అనేది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. ఇంకా నయనతార కూడా సంఘమిత్ర రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.