తులసి టీ. తులసి ఆకుల నుండి తయారైన తులసి టీ, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడటం, శ్వాసకోశ సమస్యలను తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి టీ తాగితే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
తులసి శ్వాసకోశ అసౌకర్యానికి, ముఖ్యంగా బ్రోన్కైటిస్, ఉబ్బసం, జలుబు, దగ్గులకు నివారణిగా పనిచేస్తుంది.