మాపై వచ్చే సిల్లీ న్యూస్‌కు మా రియాక్షన్ ఇదే.. నయనతార

ఠాగూర్

గురువారం, 10 జులై 2025 (17:13 IST)
స్టార్ హీరోయిన్ నయనతార, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు విడిపోతున్నారంటూ సాగిన ప్రచారంపై హీరోయిన్ నయనతార స్పందించారు. "మాపై వచ్చే సిల్లీ న్యూస్‌ చూసినపుడు మా రియాక్షన్ ఇదే" అంటూ ఆమె ఓ ట్వీట్ చేస్తూ తన భర్తతో ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. 
 
తమిళ సోషల్ మీడియాలో నయనతార దంపతులు విడిపోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. ముఖ్యంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగింది. వాటిపై నయనతార స్పందించారు. తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేస్తూ మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూసినపుడు మా రియాక్షన్ ఇదే అంటూ అసత్య ప్రచారాన్ని ఖండించారు. 
 
వైవాహిక బంధం గురించి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఆమె విడాకుల వదంతులకు కారణమైంది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అంటూ పోస్ట్ పెట్టిన ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని డిలీట్ చేశారు. ఆ లోగా స్క్రీన్ షాట్‌ వైరల్ కావడంతో నయన్ - విఘ్నేష్‌ల విడాకుల రూమర్స్ వచ్చాయి.

 

???????? #WikkiNayan pic.twitter.com/S8FtozvupS

— Nayanthara✨ (@NayantharaU) July 10, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు