ఘాటు రొమాన్స్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ బూతుకే పరాకాష్టగా నేను లేను సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌లో ఏదో కొత్తదనం కొంతమేరకే వున్నా.. దాదాపు 70 శాతం మాత్రం ఘాటు రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కోకొల్లలు. నేను లేను ట్రైలర్ విడుదలైన గంటల్లోనే ఈ ట్రైలర్ రివ్యూకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ చిత్రంలో హీరో మరణిస్తాడని.. మరణించినా తన ప్రేమ కోసం, తన ప్రేయసిని కాపాడటం కోసం మళ్లీ తిరిగి వస్తాడనే కాన్సెప్ట్ వుందనేది అర్థమవుతుందని సినీ పండితులు అంటున్నారు. అలాగే ఓ.యస్.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ''నేను లేను'' చిత్రంలో హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్ లాంటి నూతన నటీనటులు నటిస్తున్నారు. ''లాస్ట్ ఇన్ లవ్'' అనేది ఉపశీర్షికతో రామ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.