పవన్‌ను విమర్శించే తొందరలో సన్ని లియోన్‌ను తక్కువ చేసి మాట్లాడారు. మంత్రి రోజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ సన్నీకి సపోర్టుగా మంత్రి రోజాపై ఫైర్ అవుతున్నారు. పోర్న్ స్టార్ అయినా... తన జీవితాన్ని మార్చుకుని బాలివుడ్లో నటిగా కొనసాగుతున్నారని తెలిపారు.
ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నారని నెటిజన్లు సన్నీ లియోన్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. పోర్న్ స్టార్ అని ఎగతాళి చేసిన వాళ్లే ఆమెతో కలిసి నటించారని, అవకాశాలిచ్చి పోత్సహించారని నెటిజన్లు అంటున్నారు.