మంచు లక్ష్మిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నానమ్మ చనిపోయిందని ట్వీట్ చేస్తూ.. తన సినిమా ట్రైలర్ కూడా జత చేయడం ప్రస్తుతం వివాదానికి తావిస్తోంది. మంచు మోహన్ బాబు తల్లి గురువారం ఉదయం కన్నుమూశారు. దీంతో మంచు కుటుంబం తిరుపతికి బయలుదేరింది. తన నానమ్మ చనిపోయిందని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.
అంతటితో ఆగకుండా తమిళంలో తన తొలి సినిమా ట్రైలర్ చూడకుండా వుండలేకపోతున్నానని.. కాట్రిన్ మొయి ట్రైలర్ సాయంత్రం రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. ఇలాంటి విషాద సమయంలో ఆమె తన సినిమాను ప్రమోట్ చేస్తుండడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. నానమ్మ చనిపోయినా.. సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఎలా ఉంటున్నావంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు.