అనిల్ సుంకర, శ్రీ విష్ణు కాంబినేష‌న్‌లో నూతన చిత్రం

సోమవారం, 26 సెప్టెంబరు 2022 (09:53 IST)
nara rohit clap srivishnu
హాస్యభరితమైన చిత్రాలతో అలరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు(ఓటీటీ ప్రాజెక్ట్) తో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం కానున్నారు.
 
హాస్య మూవీస్ పతాకంపై  రాజేష్ దండా నిర్మాణంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర  సమర్పిస్తున్నారు. కంటెంట్ రిచ్ మూవీస్ చేస్తున్న హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ సినిమా నిర్మాణం కానుంది. అల్లరి నరేష్‌తో రూపొందిస్తున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం విడుదలకు సిద్ధమవుతుండగా, సందీప్ కిషన్ హీరోగా 'ఊరు పేరు భైరవకోన' నిర్మాణ దశలో ఉంది.
 
పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్ సుంకర, వీఐ ఆనంద్, నారా రోహిత్, విజయ్ కనకమేడల, ఏఆర్ మోహన్ పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు నారా రోహిత్ క్లాప్‌ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
 
ఈ చిత్రానికి భాను బోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్‌ అందిస్తున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది.
 
గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
 
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.
 
తారాగణం: శ్రీ విష్ణు, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.
 
సాంకేతిక విభాగం :
సమర్పణ : అనిల్ సుంకర  
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రామ్ అబ్బరాజు
నిర్మాత - రాజేష్ దండా
సహ నిర్మాత - బాలాజీ గుత్తా
బ్యానర్లు- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
కథ - భాను బోగవరపు
డైలాగ్స్ - నందు సవిరిగాన
సంగీతం - గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ - రాంరెడ్డి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ -బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్ డిజైనర్ - లక్ష్మి కిల్లారి
పీఆర్వో - వంశీ శేఖర్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు