విశాల్‌ సరసన మలయాళ కుట్టి నయనతార

శుక్రవారం, 13 జనవరి 2017 (11:24 IST)
తమిళ హీరో విశాల్‌ సరసన ఒక సినిమా చేయడానికి నయనతార అంగీకరించిందని కోలీవుడ్‌ వర్గాల టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో  తమిళంలో 'సత్యం' అనే సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమా 'సెల్యూట్‌' పేరుతో విడుదలైంది కూడా. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా చేయడానికి దర్శకుడు సోక్రటిస్‌ సన్నాహాలు చేస్తున్నాడు.
 
ప్రస్తుతం నయనతార పలు చిత్రాలతో బిజీగా వుంది. ఇక విశాల్‌ కూడా తుప్పరివాలన్‌.. ఇరుంబుతిరై .. సండై కోళి 2 సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. ఇలా ఇటు నయనతార.. అటు విశాల్‌ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, వీరి కాంబినేషన్‌‌లో నిర్మితమయ్యే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

వెబ్దునియా పై చదవండి