తన కంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను బాలీవుడ్ నటి ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత యేడాది డిసెంబరు ఒకటో తేదీన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలోను వేడుక జరిపించారు. దాదాపు నెల రోజుల పాటు వీళ్ళ పెళ్లి టాపిక్ బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రమంలో ఈ జంట ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని తామిద్దరు ఇకపై హాట్ సన్నివేశాలలో నటించకూడదని నిర్ణయించుకున్నారు. అడల్ట్ మూవీస్, షోస్, సిరీస్‌లాంటి వాటిలో ఇకపై నటించబోమని తాజాగా నిక్ జోనాస్ ఓ హాలీవుడ్ పత్రికకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కుటుంబం, పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాడు.