సదరు నెటిజన్ దిమ్మతిరిగే రిప్లై ఇస్తూ... ఈ వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం తనను షాక్‌కి గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఇలాంటివారిని చూస్తుంటే ఆశ్చర్యకరంగా వుంటుందనీ, నీ అడ్రెస్ పంపిస్తే నీకు పింక్ అనే సినిమా లింక్ పంపుతాననీ, ఆ సినిమా నీలాంటివారికి చాలా అవసరం అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. ఇపుడు దీనిపై ట్విట్టర్లో కామెంట్ల పరంపర నడుస్తోంది.