కలివి కోడిని కనుక్కునేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు

ఐవీఆర్

సోమవారం, 29 సెప్టెంబరు 2025 (14:38 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రకృతిలో నివాసం వుండే ఎన్నో జంతుజీవాలు కనుమరుగవుతున్నాయి. ఇదివరకు ఎక్కడబడితే అక్కడ పిచ్చుకలు కనిపించేవి. కానీ మొబైల్ ఫోన్ల రేడియేషన్ కారణంగా అవి గిలగిలలాడి చచ్చిపోయాయి. చివరికి ఎక్కడో టవర్లు లేని పల్లెటూర్లలోనో లేదంటే అడవుల్లోనో కనిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే... అంతరించిపోతున్న అరుదైన పక్షుల్లో కలివికోడి అనేది ఒకటి. ఈ పక్షిని తొలిసారిగా 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో చూసారట. ఆ తర్వాత మళ్లీ 1985లో కనబడిందట.
 
ఐతే ఆ తర్వాత మళ్లీ దీని జాడ 1998 వరకూ కనిపించలేదు. ఐతే 2002లో ముంబై నేచురల్ హిస్టరీ సొసైటి ఈ పక్షి కూతను, పాదముద్రలను కనుగొన్నట్లు వెల్లడించారు కానీ పక్షిని మాత్రం కనుక్కోలేకపోయారు. కాగా వైఎస్సార్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో ఈ పక్షి వున్నట్లు సమాచారం వుండటంతో సుమారు 3 వేల ఎకరాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసారు.
 
ఇలా ఈ పక్షి ఆచూకిని కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇప్పటివరకూ రూ. 50 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. గత నెల ఈ పక్షి కూతను పరిశోధకులు రికార్డ్ చేసారట. సుమారు 27 సెంటీమీటర్లు పొడవు వుండే ఈ పక్షి పైకి ఎగరలేదు. గుబురుగా వుండే ముళ్ల పొదల్లో నివాసం వుంటుంది. ఇది కూతపెడితే సుమారు 200 మీటర్ల వరకూ వినిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు