డెస్టినేషన్ వెడ్డింగ్‌గా నిహారిక పెళ్లి.. డిసెంబరులో ముహూర్తం..? (Video)

శనివారం, 17 అక్టోబరు 2020 (15:16 IST)
Niharika
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, హీరోయిన్ నిహారిక వివాహానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్‌లో గుంటూరుకి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా నిహారిక పెళ్లి వేడుకని డిసెంబర్‌లో జరపాలని మెగా ఫ్యామిలీ భావిస్తుందట. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం తన చెల్లి పెళ్ళి పనులతో బిజీగా ఉండగా, ఏ ప్రాంతంలో పెళ్లి జరపాలనే దానిపై ఓ జాబితాను సిద్ధం చేసుకుంటున్నాడని నాగబాబు చెప్పారు. 
 
అతి త్వరలోనే నిహారిక పెళ్లి తేదీని అఫీషియల్‌గా ప్రకటిస్తామని నాగబాబు అంటున్నారు. ఇదిలా ఉంటే నిహారిక , చైతన్యలకు ఆగస్ట్ 13న నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్ -ఉపాసన, అల్లు అర్జున్-స్నేహా రెడ్డిలతో పాటు సాయిధరమ్ తేజ్, పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా, నిహారిక కొద్ది రోజుల క్రితం తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాలో బ్యాచ్‌లర్ పార్టీ జరుపుకున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు నిహారిక పెళ్లి కూతురు గెటప్ లాంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో అచ్చం పెళ్లి కూతురు మాదిరి నిహారిక నగలు, పెళ్లి డ్రెస్‌తో నిగనిగలాడుతోంది. కానీ నిహారిక ఆ పెళ్లి వేషం మాత్రం తన పెళ్లి కోసం కాదు.
 
ఓ ప్రముఖ డిజైర్ షో రూమ్ కోసం నిహారిక ఈ పెళ్లి కూతురు గెటప్ వేసింది. నిహారిక ప్రోమోట్ చేసిన డ్రెస్ మాంగత్రాయ్ డిజైనర్ డ్రెస్ అని, హెయిర్ స్టైలిస్ట్ దగ్గరనుండి మేకప్ వరకు, అలాగే పిక్ క్రెడిట్ వరకు నిహారిక తన సోషల్ మీడియా పేజీలో తన పిక్‌తో పాటుగా వివరంగా పోస్ట్ చేసింది. మరి సన్నగా అచ్చం టాప్ హీరోయిన్ మాదిరి నిహారిక పెళ్లి కూతురు గెటప్, అలాగే ఆమె ఇచ్చిన ఫోజ్ చూస్తే అదిరింది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు