ఫ్యాన్స్‌కు బహుమతి ఇవ్వనున్న టాలీవుడ్ లవర్ బాయ్

శుక్రవారం, 10 జనవరి 2020 (17:03 IST)
టాలీవుడ్ లవర్‌ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో నితిన్. ఈయన నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందగా, ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 
 
ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించగా, ఆదివారం ఈనెల 12వ తేదీ ఆదివారం ప్రేక్షకులకు ఓ బహుమతి ఇవ్వనున్నాడు. జ‌న‌వ‌రి 12 ఉద‌యం 10గం.ల‌కి చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంద‌ని చెబుతున్నారు. 
 
మ‌రోవైపు నితిన్.. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి "చ‌ద‌రంగం" అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. కాగా, నితిన్ తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ నటించనున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు