పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కేవలం సాధారణ సినీ ప్రేక్షకులే కాదు హీరోలు సైతం అభిమానులుగా ఉన్నారు. వీరిలో ఒకరు యువ హీరో నితిన్ ఒకరు. ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నితిన్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'శ్రీనివాస కళ్యాణం' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ కోసం చండీఘర్‌కు ఇటీవలె వెళ్లింది. ఈ చిత్రం షూటింగ్‌లో నితిన్ బిజీగా ఉన్నారు. ఈపరిస్థితుల్లో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌కు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ వచ్చారనే వార్త నితిన్‌కు తెలిసింది. దీంతో ఓ ట్వీట్ చేశారు. తన అభిమాన నేత, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసే న్యాయపోరాట సమావేశానికి రాలేకపోతున్నానని కానీ ఎప్పటికి పవన్ కల్యాణ్ వెంటే ఉంటానని ట్వీట్ చేశాడు. అదేవిధంగా హీరో పవన్ తల్లిని దూషించినందుకుగాను నటి శ్రీరెడ్డికి కూడా హీరో నితిన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే.