ఇప్పటికే ఈ సినిమా నుంచి డేంజర్ పిల్ల... సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్.. అందులో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ మెప్పించింది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్ కనిపించని సరికొత్త అవతార్‌ను ఈ చిత్రంలో చూడబోతున్నారని, మూవీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ మెప్పిస్తుందని రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ తెలియజేశారు.
మ్యూజికల్ జీనియస్ హేరిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండటం సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది. రీసెంట్ విడుదలైన డేంజర్ పిల్లా సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.