ఎన్టీఆర్ బయోపిక్ : జయప్రదగా రాశిఖన్నా...

గురువారం, 23 ఆగస్టు 2018 (14:44 IST)
బాలకృష్ణ హీరోగా "ఎన్టీఆర్ బయోపిక్" చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహిస్తున్నారు. ఇందులో అనేక మంది సీనియర్ నటీనటుల పాత్రలకు పలువురు యంగ్ హీరోహీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో బాలకృష్ణ సుమారు 50కి పైగా పాత్రలను ధరించనున్నారు. అలాగే, ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేశారు. ఇకపోతే, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా కీర్తి సురేష్‌లను ఎంపిక చేయగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. 
 
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురష్కరించుకొని పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్ ఇప్పుడు కొత్తగా మరొక పేరుని తెరమీదకి తీసుకొచ్చారు. ఈ చిత్రంలో మరొక పాత్రగా జయప్రద పాత్రలో రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారు. కాగా, ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది కూడా. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు