టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనని నిరూపించుకున్నాడు. అభిమానులే నా దేవుళ్లనే జూనియర్.. తన పెద్ద మనసేంటో మరోసారి చూపించాడు. బెంగళూరుకు చెందిన తన వీరాభిమాని, కేన్సర్ పేషెంట్ నాగార్జునను జూనియర్ పరామర్శించాడు. నాగార్జున కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు.
నాగార్జున కేన్సర్‌తో బాధపడుతూ, మృత్యువుతో పోరాడుతున్నాడు. తన చివరికోరికగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కేరళ షూటింగ్‌ను కూడా వాయిదా వేసుకుని అభిమానిని పరామర్శించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అభిమానులే కాదు అభిమానులను మేము కూడా అభిమానిస్తాం, ప్రేమిస్తామని జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు.